శ్రీవారి ఆలయంలో మహా శాంతి యాగం శాస్రోక్తంగా ప్రారంభమైంది. లడ్డూ వివాదం నేపథ్యంలో ప్రాయశ్చిత కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించడంతో.. అందుకు అనుగుణంగా ఇవాళ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఆలయంలో మహా శాంతి యాగాన్ని నిర్వహిస్తున్నారు అర్చకులు. శ్రీవారికి ఉదయం నైవేద్య సమర్పణ జరిగిన అనంతరం బంగారు వాకిలి సమీపంలో ఉన్న యాగశాలలో మూడు యజ్ఞ కుండాలలో మహా శాంతి యాగ క్రతువు ప్రారంభించారు అర్చకులు.