ఈ యేడాది ఇప్పటికే నితిన్ నటించిన ‘చెక్’, ‘రంగ్ దే’ చిత్రాలు విడుదలయ్యాయి. కథాపరంగా ‘చెక్’ భిన్నమైనదే అయినా విజయం విషయంలో నిరుత్సాహపర్చింది. ఇక లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘రంగ్ దే’ కు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ ఆశించిన స్థాయి సక్సెస్ ను అందుకోలేక పోయింది. ఈ నేపథ్యంలో వచ్చిన సినిమా ‘మాస్ట్రో’. ఈ చిత్రం థియేటర్లలో కాకుండా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో శుక్రవారం నుండి స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ చిత్రం…