Snake Bite: రైలులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడిని పాము కాటేసింది. ఈ ఘటన మధురై-గురువాయూర్ ప్యాసింజర్ రైలులో సోమవారం ఉదయం జరిగింది. దీంతో మదురైకి చెందిన కార్తీ(23) అనే బాధితుడిని ఎట్టుమనూర్ స్టేషన్‌లో మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు.