Snake Bite: రైలులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడిని పాము కాటేసింది. ఈ ఘటన మధురై-గురువాయూర్ ప్యాసింజర్ రైలులో సోమవారం ఉదయం జరిగింది. దీంతో మదురైకి చెందిన కార్తీ(23) అనే బాధితుడిని ఎట్టుమనూర్ స్టేషన్‌లో మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. ఆరో బోగీలో ప్రయాణిస్తున్న కార్తీ పాముకాటుకు గురయ్యారు.
Read Also:Chandrababu: ఉత్తరాంధ్రంలో 35 సీట్లు గెలిపించాలి.. ఓటర్లను కోరిన టీడీపీ అధినేత
ప్రయాణికుడి సీటు కింద పాము ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. బాధితుడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో రైలును ఎట్టుమనూర్ స్టేషన్‌లో 10 నిమిషాలు నిలిపేశారు. రైలు ఎట్టుమనూర్ స్టేషన్ రాగానే కార్తీని హుటాహుటీన కొట్టాయం మెడికల్ కాలేజీలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేర్చారు. రైలు ఎర్నాకుళం స్టేషన్ దాటగానే పాముకాటుకు గురైనట్లు తేలింది. బోగీ మొత్తం వెతికినా పాము కనిపించలేదని రైల్వే పోలీసులు చెబుతున్నారు.