Saudi Arabia: ఎడారితో నిండి ఉండే సౌదీ అరేబియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పవిత్ర నగరాలైన మక్కా, మదీనా, జెడ్డా నగరాలు జలాశయాలను తలపిస్తున్నాయి. రోడ్లన్ని నీటిలో నిండిపోయాయి. మక్కా నగరంలోని పలు అపార్ట్‌మెంట్లలోకి నీరు చేరింది. వర్షాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. లగ్జరీ కార్లు వరద నీటిలో మునిపోయాయి.