Vallabhaneni Vamsi: వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో ఊరట దక్కింది. బెజవాడ మాచవరం పోలీసులు వంశీపై హత్య యత్నం కేసు నమోదు చేశారు. నూతక్కి సునీల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో వంశీ పై కేసు నమోదైంది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని వంశీ దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. వంశీని అరెస్టు చేయవద్దని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.…
Vijayawada Drugs Case: విజయవాడలో సంచలనం రేపిన డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేత కొండారెడ్డిని నిందితుడిగా చేర్చారు పోలీసులు.. ఈ కేసులో ఏ5గా కొండారెడ్డి పేరును చేర్చారు మాచవరం పోలీసులు.. ఇప్పటికే ఈ కేసులో ఏ6 మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో బయటపడ్డ వివరాల ఆధారంగా కొండారెడ్డి పేరు చేర్చినట్లుగా తెలుస్తోంది. కొండారెడ్డికి డ్రగ్స్ కొనుగోలులో సంబంధాలు ఉన్నాయని దర్యాప్తులో తేలినట్టు…