రైతులు కష్టాలు తీరాలంటే చంద్రబాబుకు పట్టం కట్టాలని, రైతును దగా చేసిన సీఎం జగన్ పాలనకు చరమగీతం పాడాలని ఎమ్మిగనూరు నియోజకవర్గంలో టిడిపి నాయకులు డాక్టర్ మాచాని సోమనాథ్ పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన ఎమ్మిగనూరు పట్టణంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ నందు గల కూరగాయల వేలం మార్కెట్ నందు,ఎద్దుల మార్కెట్ యందు, మేకల బజార్ లో తిరిగి బాబు షూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ పై ప్రచారం నిర్వహించారు. రైతులను కలుసుకొని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను, బాధలను విన్నారు.…