SIR: దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)’’ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. బీహార్‌లో ఇప్పటికే ఇది వివాదాస్పదం అయింది. నకిలీ ఓటర్లను తీసేస్తున్నామని ఎన్నికల సంఘం చెబుతున్నప్పటికీ, ఇది ఉద్దేశపూర్వకంగా బీజేపీకి సహకరించేందుకు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఇదిలా ఉంటే, తమిళనాడులో ఎన్నికల కమిషన్ చేపట్టే ఓటర్ల జాబితా సవరణను సవాల్ చేస్తూ డీఎంకే సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
CM Revanth Reddy: నియోజకవర్గాల పునర్విభజనతో నష్ట పోనున్న రాష్ట్రాల గళాన్ని వినిపించేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో చెన్నైలో రేపు (మార్చ్ 22) నిర్వహించనున్న సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. చెన్నైలోని గిండీలో గల ఐటీసీ చోళ హోటల్లో ఉదయం 10. 30 గంటలకు సదస్సు ప్రారంభం కానుంది.
తమిళనాడు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తాజాగా సూపర్ స్టార్ రజినీ కాంత్ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది. ఈ వ్యాఖ్యలను ఉదహరిస్తూ.. డీఎంకే పార్టీ, సీఎం స్టాలిన్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
తమిళనాడు రాష్ట్రంలో ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ట్రాన్స్ మహిళ నివేత (20), చిన్నదురై అనే దళిత విద్యార్థి ఉత్తీర్ణత సాధించారు. తిరునల్వేలి జిల్లాకు చెందిన చిన్నదురై 78 శాతం మార్కులు సాధించగా.. నివేత 47.1 శాతం మార్కులు సాధించింది. వీరిని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మంగళవారం ఘనంగా సత్కరించారు. ముఖ్యమంత్రి సమక్షంలో తన ఛాంబర్‌లో నివేత, చిన్నదురైను ఘనంగా సత్కరించారు. పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యమొళి, ప్రధాన కార్యదర్శి శివదాస్…