సూర్యగ్రహణం సందర్భంగా ప్రధాన ఆలయాలన్నీ మూసువేశారు. యాదగిరి గుట్ట దేవస్థానాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు ఇవాళ ఉదయం 8.50 గంటలలోపు ఆలయంలో నిర్వహించే సాధారణ పూజా కార్యక్రమాలు పూర్తవుతాయని వెల్లడించారు. అయితే 1 గంట 45 నిమిషాలకు వరకు గ్రహణం ఘడియలు ఉండనందున ఆలయం మూసివేస్తున్నట్లు వెల్లడించారు.
అక్టోబర్ 25న సూర్యగ్రహణం కారణంగా.. నవంబర్ 8న చంద్రగ్రహణం కారణంగా స్వామి వారి దర్శనాలు నిలిపివేయనున్నారు.. ఆయా రోజుల్లో 12 గంటల పాటు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేసే ఉంటాయని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.
ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం ఈనెల 15, 16 తేదీల్లో ఏర్పడనుంది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7:02 గంటల నుంచి చంద్రగ్రహణం ప్రారంభం కానుంది. ఉదయం 7.57 గంటల నుంచి భూమి నీడ చంద్రుడి మీద పడుతుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నం 12.20 గంటలకు చంద్రగ్రహణం ముగుస్తుంది. అయితే చంద్రగ్రహణం సందర్భంగా చంద్రుడు నెత్తురు ఆకారంలో రుధిరంగా కనిపించనున్నాడు. దీనినే బ్లడ్ మూన్ అని కూడా పిలుస్తారు. Read Also: Sri Lanka…