ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం ఈనెల 15, 16 తేదీల్లో ఏర్పడనుంది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7:02 గంటల నుంచి చంద్రగ్రహణం ప్రారంభం కానుంది. ఉదయం 7.57 గంటల నుంచి భూమి నీడ చంద్రుడి మీద పడుతుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నం 12.20 గంటలకు చంద్రగ్రహణం ముగుస్తుంది. అయితే చంద్రగ్రహణం సందర్భంగా చంద్రుడు నెత్తురు ఆకారంలో రుధిరంగా కనిపించనున్నాడు. దీనినే బ్లడ్ మూన్ అని కూడా పిలుస్తారు.
Read Also:
సూర్యుడి కిరణాలు భూమిని తాకినప్పుడు నీలం, ఆకుపచ్చ రంగులు మాత్రం చెల్లాచెదురవుతాయని.. అప్పుడు కేవలం ఎరుపు, నారింజ రంగులు కనిపిస్తాయని, అందుకే మనకు చంద్రుడు ఎర్రగా కనిపిస్తాడని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. గ్రహణం సమయంలో చంద్రుడు కొద్దిసేపు మాయమైపోతాడని చెప్పారు. అయితే చంద్ర గ్రహణాన్ని చూసేందుకు ఎలాంటి కళ్లద్దాలు అవసరం లేదని, రక్షణపరికరాల్లేకుండానే చూడవచ్చని అంతరిక్ష శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే మన దేశంలో ఈ చంద్రగ్రహణం కనిపించదు. అమెరికా, ఆసియా, అంటార్కిటికా, యూరప్, ఆఫ్రికా, న్యూజిలాండ్, మిడిల్ ఈస్ట్ దేశాల్లో చంద్రగ్రహణం కనిపించనుంది. నాసా ఈ చంద్ర గ్రహణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయబోతోంది. గ్రహణాన్ని వీక్షించాలని భావించేవాళ్లు సోమవారం ఉదయం 8.33 గంటలకు నాసా వెబ్ సైట్‌లో లైవ్ ద్వారా చూడొచ్చు.