తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో బరువుపై ఛార్జీల మోత మోగనుంది. కొద్దిరోజులుగా మాటిమాటికి ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచుతున్న తెలంగాణ ఆర్టీసీ ఆసారి లగేజీ ఛార్జీలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కొత్త ఛార్జీలు శుక్రవారం నుంచి అమలు కానున్నట్లు ప్రకటించింది. తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఇకనుండి టైర్లు తీసుకెళ్లాలంటే మూడింతలు, సైకిల్ కైతే రెండింతలు లగేజీ ఛార్జీలు చెల్లించాల్సిందే. కాగా.. ఇటీవలే రెండు దఫాలుగా సెస్సులు తదితరాల పేరుతో ప్రయాణికుల ఛార్జీలను పెంచగా..తాజాగా లగేజీ ఛార్జీలను…