ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో కొత్తగా అడుగుపెట్టబోతున్న లక్నో ఫ్రాంచైజీకి అధికారులు నామకరణం చేశారు. ఇకపై లక్నో ఫ్రాంచైజీని లక్నో సూపర్ జెయింట్స్ అని పిలవనున్నారు. తమ ఫ్రాంచైజీకి పేరును సూచించాలంటూ లక్నో జట్టు సోషల్ మీడియాలో ప్రచారం నిర్వహించింది. ఈ క్రమంలో లక్నో ఫ్రాంచైజీ అధినేత సంజీవ్ గోయెంకా తమ జట్టు పేరును అధికారికంగా వెల్లడించారు. ఈ మేరకు టీమ్ లోగోను కూడా ఆవిష్కరించారు. అయతే ఈ పేరు గతంలో ఆడిన పూణె జట్టుకు ఉండేది.…