మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మలయాళ బ్లాక్ బస్టర్ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ‘గాడ్ ఫాదర్’ టైటిల్ తో రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ మూవీకి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సినిమాను ప్రారంభించారు. ‘గాడ్ ఫాదర్’ను ఎన్‌వి ప్రసాద్, రామ్ చరణ్‌లతో కలిసి ఆర్‌బి చౌదరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రబృందం ‘గాడ్ ఫాదర్’లోని పాత్రల కోసం మిగిలిన నటీనటులు, సిబ్బందిని ఖరారు చేయడంలో బిజీగా ఉంది. అయితే…