Krishnamachari Srikkanth: ప్రస్తుత ఐపీఎల్ సీజన్ ఒకవైపు హోరాహోరీగా సాగుతున్నా.. మరోవైపు మాజీ ప్లేయర్స్ ఆటగాళ్ల ఆటతీరుపై చేసే వ్యాఖ్యలు కూడా తెగ ట్రెండ్ అవుతున్నాయి, ఈ నేపథ్యంలో రిషబ్ పంత్‌ను లక్నో సరిగ్గా ఉపయోగించుకోవట్లేదని టీమిండియా మాజీ ప్లేయర్ కృష్ణమాచారి శ్రీకాంత్ విమర్శించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా కొనసాగుతున్న రిషబ్ పంత్ ప్రస్తుత ఐపీఎల్‌లో 10 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 110 పరుగులు మాత్రమే చేశాడు. ఓ వైపు ఫామ్ లేమితో సతమవుతున్న పంత్…