Krishnamachari Srikkanth: ప్రస్తుత ఐపీఎల్ సీజన్ ఒకవైపు హోరాహోరీగా సాగుతున్నా.. మరోవైపు మాజీ ప్లేయర్స్ ఆటగాళ్ల ఆటతీరుపై చేసే వ్యాఖ్యలు కూడా తెగ ట్రెండ్ అవుతున్నాయి, ఈ నేపథ్యంలో రిషబ్ పంత్‌ను లక్నో సరిగ్గా ఉపయోగించుకోవట్లేదని టీమిండియా మాజీ ప్లేయర్ కృష్ణమాచారి శ్రీకాంత్ విమర్శించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా కొనసాగుతున్న రిషబ్ పంత్ ప్రస్తుత ఐపీఎల్‌లో 10 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 110 పరుగులు మాత్రమే చేశాడు. ఓ వైపు ఫామ్ లేమితో సతమవుతున్న పంత్ కు లక్నో తీసుకునే నిర్ణయాలు కలిసిరావడం లేదు. దూకుడుగా ఆడే మనస్తత్వం ఉన్న పంత్ ను లక్నో యాజమాన్యం ఏడో నంబర్ లో బ్యాటింగ్ కు పంపడం కొందరికి నచ్చలేదు.
తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో రిషబ్ పంత్ బ్యాటింగ్ కు వచ్చే సమయానికి కేవలం రెండు బంతులు మాత్రమే మిగిలి ఉన్నాయి. క్రీజులోకి వచ్చిన పంత్ రివర్స్ స్కూప్ ఆడే ప్రయత్నంలో డకౌట్ అయ్యాడు. అసలు పంత్ లాంటి విధ్వంసకర బ్యాటర్‌ను ఇంత ఆలస్యంగా పంపడం అభిమానులను, క్రికెట్ విశ్లేషకులను షాక్‌కు గురిచేసింది. ఒకప్పుడు మినిమమ్ గ్యారంటీ ప్లేయర్ గా ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన పంత్ ఇప్పుడు మినిమమ్ పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు.
Read Also: Minister Nara Lokesh: వంద పాకిస్థాన్‌లకు సమాధానం చెప్పే మిస్సైల్ మనదగ్గర ఉంది..అందేంటో తెలుసా?
అయితే, పంత్ ని అలా చివర్లో బ్యాటింగ్ కి పంపడం ద్వారా తన ఆత్మవిశ్వాసం దెబ్బ తినే ప్రమాదం ఉందని.. తాజాగా కృష్ణమాచారి శ్రీకాంత్ ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేశాడు. పంత్ ను చివర్లో బ్యాటింగ్ కి పంపించడం వెనుక మీ ఉద్దేశం ఏంటని? లక్నో కోచ్ జస్టిన్ లాంగర్, మెంటర్ జహీర్ ఖాన్ ని ప్రశ్నించాడు. పంత్ టీమ్ కెప్టెన్ అని గుర్తు చేసుకోవాలని వారికి సూచించాడు. ఒక కెప్టెన్ ఎప్పుడు బ్యాటింగ్ చేయాలో అతనే నిర్ణయించుకోవాలని, ఆ విషయంలో ఎవరి పర్మిషన్ అవసరం లేదన్నాడు. మరి పంత్ బ్యాటింగ్ స్థానాన్ని మీరెలా నిర్ణయిస్తారు.? మీకు మైండ్ ఏమైనా దొబ్బిందా..? అంటూ చురకలంటిచ్చాడు.