రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని హోంమంత్రి తానేటి అనిత తక్షణమే స్పందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్‌తో ఫోన్‌లో మాట్లాడి తాజా పరిస్థితిపై సమాచారం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను అప్రమత్తం చేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
Bhadrachalam: అల్పపీడనం, భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి పర్యాట ప్రాంతంలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ప్రస్తుతం 48 అడుగులకు చేరుకోవడంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. మహారాష్ట్ర, ఛత్తీస్ఘడ్, ఒడిస్సా రాష్ట్రాల నుంచి వస్తున్న వరదలతో తెలంగాణ ఎగువన వున్న వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. దీంతో ఎగువ నుంచి కాళేశ్వరం, మేడిగడ్డ, తుపాకుల గూడెంతో పాటు ఛత్తీస్ఘడ్ నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి పెరిగింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరుకుంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను…