Bhadrachalam: అల్పపీడనం, భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి పర్యాట ప్రాంతంలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ప్రస్తుతం 48 అడుగులకు చేరుకోవడంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 53 అడుగులకు వస్తే మూడో ప్రమాదకరమైన జారీ చేయనున్నారు. నాగారం వద్ద కూడా గోదావరి పెరుగుతూ వస్తుంది. చత్తీస్గడ్ నుంచి వస్తున్న వరద వల్ల.. గోదావరి ఎగువ ప్రాంతం నుంచి వరద వస్తుంది.. దిగువన శబరివల్ల గోదావరి కి పోటు వస్తుంది.. అయితే శబరి వద్ద స్వల్పంగా తగ్గుతల ప్రారంభమైంది.
Read also: Haryana : దారుణం.. ఆర్నెళ్ల పాపతో సహా ఐదుగురు కుటుంబ సభ్యులను హతమార్చిన జవాన్
ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికార యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది బూర్గంపాడు మండలంలో పునరావస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కాగా.. 53 అడుగులకు వస్తే మూడో ప్రమాదకరమైన హెచ్చరికలు జారీ చేస్తారు. కాగా ఛత్తీస్ ఘడ్, ఒడిస్సా రాష్ట్రాల నుంచి భారీగా వరద అంతా శబరి మీద పడింది. శబరి నీటి ప్రవాహం వేగంగా పెరిగింది. ప్రస్తుతం శబరి 40 అడుగులకు చేరుకోవడంతో అక్కడ కూడా మొదటి ప్రమాద హెచ్చరిక ప్రారంభమైంది. దీంతో గోదావరి స్పీడ్ తగ్గింది. భద్రాచలం వద్ద గోదావరి కొద్ది మేరకు పెరుగుతున్నది. ఇది మరింత పెరిగి రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి వరకు వస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో ముందస్తు హెచ్చరికల్ని ఇప్పటికే అధికారులు జారీ చేశారు. రెండో ప్రమాద హెచ్చరిక తర్వాత పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.
Michael Vaughan: విరాట్, కేన్ వల్ల కాదు.. సచిన్ టెస్టు స్కోరును అధిగమించేది అతడే!