Low Fertility Rate: చైనా, జపాన్, దక్షిణ కొరియా దేశాలు ‘‘తక్కువ సంతానోత్పత్తి’’ ఇబ్బందులు పడుతున్నాయి. ఈ దేశ ప్రజలు వివాహాలకు , పిల్లలు కనడానికి ఆసక్తి చూపించడం లేదు. దీంతో ఇటీవల కాలంలో తక్కువ జననాలు నమోదవుతుండటం ఆ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. జపాన్‌లో సంతానోత్పత్తి రేటు చాలా ఏళ్ల తర్వాత జూన్ నెలలో రికార్డ్ స్థాయిలో తగ్గిపోయింది.