పెళ్లి చూపులు.. ఒకరికొకరు ఇష్టపడడం.. పెద్దలు పెళ్లికి ముహూర్తాలు పెట్టడం. బంధువులకు పెళ్లి కార్డులు పంచడం. మండపాలు, లైటింగ్, గ్రాండ్‌గా వివాహ ఏర్పాట్లు, కొత్త బట్టలు, నగలు, ఇలా అన్ని ఏర్పాట్లు చేసుకుని అమ్మాయి-అబ్బాయి ఇద్దరు పెళ్లి చేసుకుని ఏడడుగులు నడిచి సంతోషంగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. హాయ్‌గా సంసారం సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో నవ వధువు ఒక్కసారిగా షాకిచ్చింది.