ఇటీవల కాలంలో వరుసగా యువతీయువకుల ప్రేమ పలు వివాదాస్పద ఘటనలకు కారణమవుతోంది. తాజాగా ఇలాంటి ఉదంతం మరొకటి వెలుగు చూసింది. ఏపీలోని కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో ఓ ప్రేమజంట ప్రేమించుకున్నారనే కారణంగా వారి కుటుంబాల మధ్య వైరం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. వివరాల్లోకి వెళ్తే.. మంత్రాలయం మండలం మాధవరం గ్రామానికి చెందిన శ్రీజ, శివాజీ అనే యువతీయువకులు ప్రేమించుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న శ్రీజ కుటుంబసభ్యులు ఆమెకు మూడురోజుల క్రితం రచ్చమర్రికి చెందిన భీమతో…