టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. శివశంకర్ మాస్టర్, సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతినే జీర్ణించుకోలేకపోతున్న టాలీవుడ్ ని ఇంకా తీవ్ర విషాదంలోకి నెడుతూ ప్రముఖ నిర్మాత జక్కుల నాగేశ్వరరావు (46) రోడ్డు ప్రమాదంలో మరణించారు. ‘లవ్ జర్నీ’, ‘అమ్మా నాన్న ఊరెళితే’, ‘వీడు సరైనోడు’ లాంటి చిత్రాలను తెలుగులో విడుదల చేసిన నిర్మాత జక్కుల నాగేశ్వరరావు కృష్ణా జిల్లా ఉయ్యురు మండలం మంటాడలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆయన సంఘటనా స్థలంలోనే మృతిచెందినట్లు తెలుస్తోంది.…