వినాయక చవితి రోజు బాపట్ల జిల్లాలో విషాద ఘటన జరిగింది.. తామర పూల కోసం వెళ్లి చెరువులో పడి ఇద్దరు బాలురు ప్రాణాలు విడిచారు.. ఈ ఘటనలో బాపట్ల జిల్లాలోని పూండ్ల గ్రామానికి చెందిన ఇద్దరు బాలురు మృతిచెందారు.. వినాయక చవితి పర్వదినం సందర్భంగా.. తామర పూల కోసం చెరువులోకి దిగారు ఇద్దరు బాలురు.. మృతులు పూండ్ల గ్రామానికి చెందిన 17 ఏళ్ల సైకం నాగభూషణం, 15 ఏళ్ల సుద్దపల్లి శ్రీమంత్ గా గుర్తించారు.