తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులు శైవక్షేత్రాలకు చేరుకుని స్వామి వారిని దర్శించుకుంటున్నారు. అభిషేక ప్రియుడైన భోలాశంకరుడికి ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. సముద్ర స్నానాలు, నదీ స్నానాలను ఆచరించి భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామస్మరణతో ఆలయాలు మారుమ్రోగుతున్నాయి. కాళేశ్వరం ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తుల సందడి నెలకొంది. గోదావరి నదిలో పుణ్యస్నానాలు, ఆలయంలో స్వామి వారికి భక్తులు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం 4.30 గంటలకు…