ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ విపక్ష, అధికార పక్ష నేతల మధ్య మాటల యుద్ధం హోరెత్తే అవకాశం కనిపిస్తోంది. మూడు సంవత్సరాలుగా టీడీపీ సభ్యులను అవమానాలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు శాసనసభలో టీడీపీ ఉప నేత అచ్చెన్నాయుడు. ప్రతిపక్ష నాయకుడుతో పాటు కుటుంబ సభ్యులను సైతం అవమానిస్తున్నారు. శాసనసభా గౌరవాన్ని వైసీపీ ఎమ్మెల్యేలు మంట గలుపుతున్నారు. కర్తవ్య బాధ్యతను నెరవేర్చడం కోసం టీడీపీ తరపున సభకు హాజరు అవుతున్నాం. శాసనసభలో ఇన్ని ఇబ్బందులు, అవమానాలు ఎప్పుడు…