లండన్‌లో నివసిస్తున్న 24 ఏళ్ల భారతీయ యువతి హర్షిత బరేలా హత్యకు గురైంది. నవంబర్ 14న ఆమె మృతదేహాన్ని కారు ఢిక్కీ నుంచి స్వాధీనం చేసుకున్నారు. తన కూతురు హత్యపై తల్లి సుదేష్ కుమారి మీడియాతో మాట్లాడుతూ.. తన భర్త తనను చంపేస్తానని తన కూతురు కొన్ని వారాల క్రితమే చెప్పిందని తెలిపింది.
కెనడాలో భారతీయులపై దాడులు పెరుగుతున్నాయి. ప్రతిరోజూ భారతీయులను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా భారతీయ విద్యార్థిని హత్య కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సర్నియాలో భారతీయ విద్యార్థిని కత్తితో పొడిచి చంపారు. బాధితుడిని పంజాబ్‌కు చెందిన గురాసిస్ సింగ్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే కొందరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న భారతీయ విద్యార్థిని గుర్తించారు.
లండన్‌లో అమెరికా రాయబారి కార్యాలయం దగ్గర అనుమానాస్పద ప్యాకేజీ తీవ్ర కలకలం రేపింది. దీంతో యూకే పోలీసులు అప్రమత్తమై శుక్రవారం ప్యాకేజ్‌ను నిర్వీర్యం చేశారు. ప్యాకేజీ ఎక్కడినుంచి వచ్చిందనేదానిపై లండన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని అమెరికా ఎంబసీ వెల్లడించింది. మరోవైపు గాట్విక్ ఎయిర్‌పోర్టులో భద్రతాపరమైన ఘటన మరొకటి జరిగింది. దీంతో ఎయిర్‌పోర్టు దక్షిణ టెర్మినల్‌ను ఖాళీ చేయించామని అధికారులు తెలిపారు. ఇదిలాఉంటే రష్యా- ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం నేపథ్యంలో మాస్కో, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి.…
లండన్‌లోని 10 డౌనింగ్ స్ట్రీట్‌లో ప్రధాన మంత్రి కీర్ స్టార్‌మర్ నిర్వహించిన దీపావళి రిసెప్షన్ మెనూలో అంశాలను చేర్చే ముందు సరైన సలహా తీసుకోకపోవడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. నాన్ వెజ్ స్నాక్స్, మద్యాన్ని మెనూలో చేర్చడంపై బ్రిటిష్ హిందువులు సోషల్ మీడియాలో అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందువుల పండుగ ఆధ్యాత్మిక కోణంపై అవగాహన లేకపోవడాన్ని హిందూ సంస్థ ఇన్‌సైట్ యూకే ప్రశ్నించింది.
ఓ ట్యాక్సీ డ్రైవర్ నుంచి వెళ్లిన మెసేజ్.. తనకు వివాహమై భర్త పిల్లలు కూడా ఉన్నారన్న విషయాన్ని మర్చిపోయేలా చేసింది. ఏకంగా లండన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చేలా రప్పించింది. భార్య కనిపించకపోవడంతో భర్తకు అనుమానం మొదలై విచారించగా.. ట్విస్ట్‌లు బయటపడ్డాయి.
జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలంలోని శ్రీ మల్లికార్జునస్వామి దేవస్థానం మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.. శ్రీశైలం ఆలయం విస్తీర్ణం.. అలానే ఆలయంలోని నంది విగ్రహానికి.. ఆలయ నిర్వాహణకు ఇంగ్లాండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు లండన్ సంస్థలో స్థానం లభించింది..
లండన్ ఎయిర్‌పోర్టులో పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. ప్రయాణికుల పట్ల భద్రతా సిబ్బంది అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. ప్రయాణికుల కళ్లల్లో పెప్పర్ స్ప్రే చల్లి నేలకేసి కొట్టారు. ఇష్టానుసారంగా హింసించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
లండన్‌లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు కుమార్తెలను అత్యంత దారుణంగా చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఈ మధ్య విమానాల్లో వింత వింత సంఘటనలు జరుగుతున్నాయి. కొందరు ప్రయాణికులు జుగుప్సకరంగా ప్రవర్తిస్తుంటే.. మరికొందరు దాడులకు దిగుతున్నారు. ఇలాంటి ఘటనలతో నిత్యం ఎయిర్‌లైన్స్‌కు సంబంధించి వార్తల్లో నిలుస్తున్నాయి.