కొత్తగా కొలువు తీరిన లోక్‌సభ స్పీకర్ ఎన్నిక నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ పదవి గురించి కూడా చర్చ ప్రారంభమైంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడుతూ, “విపక్షాలు డిప్యూటీ స్పీకర్ ఎవరో తేల్చాలని డిమాండ్ చేస్తున్నాయి. డిప్యూటీ స్పీకర్ ఎవరో తేలిస్తేనే స్పీకర్‌కు మద్దతు ఇస్తామని విపక్షాలు అంటున్నాయి. ఇలా రాజకీయాలు చేయడం సరికాదు” అని తెలిపారు. “డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షాలకు ఇవ్వాలని ఎలాంటి నిబంధన లేదు. లోక్‌సభకు ఎలాంటి ప్రతిపక్షం లేకుండా అన్ని…
కొత్తగ కొలువు తీరిన లోక్ సభ స్పీకర్ ఎన్నికకు సంబంధించి రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. అభ్యర్థుల మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. అభ్యర్థులు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలలోపు నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. స్పీకర్‌గా ఓం బిర్లాకు మరోసారి అవకాశం ఇవ్వాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కాసేపు ఎన్డీయే కూటమితో చర్చించనుంది 11.30 గంటలకు ఎన్డీయే సమావేశం ఉంది. ఈరోజు స్పీకర్ పేరును బీజేపీ ప్రతిపాదించనుంది. ఇప్పటికే మిత్రపక్షాలతో స్పీకర్ ఎంపికపై చర్చించారు…
కేంద్రంలో మోదీ ప్రభుత్వం మళ్లీ కొలువుదీరింది. ఇప్పుడు లోక్‌సభ స్పీకర్ పదవి ఎవరికోసం అన్నది ఆసక్తికరంగా మారింది. పూర్తి మెజారిటీ లేకపోవడంతో భాగస్వామ్య పక్షాల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటైంది. స్పీకర్ పదవి భాజపాకు దక్కుతుందా, మిత్రులకు ఇస్తారా అనేది చర్చనీయాంశం. ప్రొటెమ్ స్పీకర్‌గా కాంగ్రెస్ సీనియర్ నేత కొడికున్నిల్ సురేశ్ లేదా భాజపా సీనియర్ నేత వీరేంద్ర కుమార్ ఉండే అవకాశాలు ఉన్నాయి. స్పీకర్‌గా పురందేశ్వరి లేదా ఓం బిర్లా పేర్లు ప్రచారంలో ఉన్నాయి. మరిన్ని వివరాలు…