Census: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ‘‘జనాభా లెక్కల’’ సేకరణకు సిద్ధమైంది. 2025లో దేశ జనాభాపై అధికారిక సర్వే అయిన జనగణను ప్రభుత్వం ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఈ ప్రక్రియ 2025లో ప్రారంభమవుతుంది మరియు 2026 వరకు కొనసాగుతుందని సంబంధిత వర్గాలు సోమవారం తెలిపాయి. ‘కులగణన’ కోసం ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. అయితే, జనాభా గణనకు సంబంధించి వివరాలను ఇంకా బహిరంగపరచలేదు.
నాలుగు సంవత్సరాల సుదీర్ఘ ఆలస్యం తర్వాత 2025లో దేశ జనాభాకు సంబంధించిన అధికారిక సర్వే అయిన జనాభా గణనను ప్రభుత్వం ప్రారంభించనుందని సోమవారం ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ ప్రక్రియ 2025లో ప్రారంభమవుతుందని, 2026 వరకు కొనసాగుతుందని భావిస్తున్నారు. జనాభా లెక్కల అనంతరం లోక్‌సభ స్థానాల విభజన ప్రక్రియ ప్రారంభమవుతుందని, 2028 నాటికి ఈ కసరత్తు పూర్తయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.