పార్లమెంట్‌లో గతవారం నెలకొన్న భద్రతా వైఫల్యం ఘటనపై ఇరు సభల్లో విపక్ష ఎంపీల ఆందోళనలు కొనసాగుతున్నాయి. విపక్షాల నిరసనలతో రాజ్యసభ, లోక్‌సభల్లో కార్యకలాపాలు స్తంభించాయి. ఈ క్రమంలో లోక్‌సభలో ఆందోళన చేపట్టిన విపక్ష సభ్యులపై స్పీకర్ సస్పెన్షన్ వేటువేశారు.