టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ ఐకాన్ ఎంఎస్ ధోనీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. శనివారం దేశ వ్యాప్తంగా ఆరో విడత ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. దీంతో తన స్వస్థలం రాంచీలో ఎంఎస్. ధోనీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొద్దిరోజుల క్రితమే ధోనీ బెంగళూరు నుంచి రాంచీ వరకు ఎకానమీ క్లాస
దేశ వ్యాప్తంగా శనివారం ఆరో విడత ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. అయితే పలు ఈవీఎంలకు బీజేపీ ట్యాగ్‌లు ఉండడంతో ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అయ్యాయి.
జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్- రాజౌరీ పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దిగిన పీడీపీ (పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ) అధినేత మెహబూబా ముఫ్తీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తూ.. పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఆందోళనకు దిగింది.
ఆరో దశ లోక్‌సభ ఎన్నికల్లో ఉదయం 9 గంటల సమయానికి 10.82 శాతం ఓటింగ్ నమోదైంది. ఇక, ఉదయం 9 గంటల వరకు ఢిల్లీలో 8.94 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 12.33 శాతం, బీహార్‌లో 9.66 శాతం, పశ్చిమ బెంగాల్‌లో 16.54 శాతం నమోదు అయింది.
ప్రధాని మోడీ శుక్రవారం హిమాచల్‌ప్రదేశ్ మండీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా చివరి విడతలో జూన్ 1న మండీ నియోజకవర్గానికి పోలింగ్ జరగనుంది.
ప్రతి బూత్‌లో పోలింగ్ ముగిసిన 48 గంటలలోపు పోలైన ఓట్లు/లేదా తిరస్కరించబడిన ఓట్లతో సహా ఓటరు ఓటింగ్ డేటాను విడుదల చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను లోక్‌సభ ఎన్నికల ముగిసే వరకు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
MLC Kavitha: ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. జస్టిస్ స్వర్ణకాంత శర్మతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
Loksabha Elections : మే 25న ఢిల్లీలో ఓటింగ్‌కు ఢిల్లీ పోలీసులు పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు. ఎన్నికల రోజున ఢిల్లీలో దాదాపు 60 వేల మంది పోలీసులు భద్రత బాధ్యతలు చేపట్టనున్నారు.
ఆరో దశ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీహార్‌లోని ఎనిమిది స్థానాలకు శనివారం ఏకకాలంలో పోలింగ్ జరగనుంది. వీటిలో కొన్ని సీట్లు నేపాల్, ఉత్తరప్రదేశ్ సరిహద్దులకు ఆనుకుని ఉన్నాయి. ఈ క్రమంలో నేపాల్, ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో నిఘా పెంచారు. 60 వేల మందికి పైగా భద్రతా బలగాలను మోహరించారు. దీంతో పాటు ఎన్నికల వి�
రెండ్రోజుల్లో దేశ రాజధాని ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం.. కేంద్రప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఢిల్లీలో నీటి సంక్షోభం సృష్టించేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఢిల్లీ జలవనరుల మంత్రి ఆతిషి ఆరోపించారు.