Operation Sindoor: పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్‌పై ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిర్వహించింది. కేవలం నాలుగు రోజుల్లోనే పాక్ కాళ్ల బేరానికి వచ్చేలా చేసింది. అయితే, ఈ ఆపరేషన్ గురించిన వివరాలు ఒక్కొక్కటిగా ప్రస్తుతం బయటకు వస్తున్నాయి. భారత్ చెప్పినదాని కన్నా దాడి తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్లు పాకిస్తాన్ పత్రాలు చెబుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ విజయం సాధించి ఒక నెల గడవడంతో నేషనల్ సెక్యూరిటీ ప్లానర్స్, మిలిటరీ అధిపతులు శనివారం సాయంత్రం వేడుకలు చేసుకున్నారు.