కరోనా మహమ్మారి మహిళలకు కొత్త కష్టాలు తెచ్చిపెడుతోంది. లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితం కావడంతో వేధింపులకు గురవుతున్నారు. రోజులో ఏదోవొక సందర్భంలో భర్తల చేతిలో భౌతిక దాడులకు గురవుతున్నారు. తెలంగాణలో రెండున్నరేళ్లలో పెరిగిన గృహ హింస ఫిర్యాదులే దీనికి నిదర్శనం. మహిళా సహాయ కేంద్రం ఏర్పాటు చేసిన రెండేన్నరేళ్లలో వచ్చిన ఫిర్యాదులు కన్నా కరోనా కాలంలోనే ఎక్కువగా నమోదు కావడం గమనార్హం. రోజుకు సగటున సుమారు 28 చొప్పున ఏడాది కాలంలో 10,338 కేసులు నమోదయ్యాయి. అలాగే లైంగిక…
దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న వేళ పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ లు, కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. కాగా గత ఏడాది మంచి ముహూర్తాలు వున్నా.. పెళ్లిళ్లలను చాలా మంది తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లోనూ మంచి ముహుర్తాలే ఉండటంతో ఎలాంటి హడావుడి లేకుండా వివాహాలు జరుగుతున్నాయి. ఎక్కువ మంది అతిథులు లేకున్నా.. మండపాలు లేకున్నా చాలా చోట్ల ఇండ్లల్లో, గుళ్ళల్లో పెళ్లిళ్లు జరుగుతున్నాయి. పరిమిత సంఖ్యలో నిబంధనలు ఉండటంతో తక్కువ మంది…
తెలంగాణలో 6వ రోజు లాక్ డౌన్ సడలింపు కొనసాగుతుంది. నిన్న మొన్నటితో పోలిస్తే అల్వాల్ రైతు బజార్ లో జనాల తాకిడి తగ్గింది. 10 లోపు తమ కూరగాయలను అమ్ముకొని పోతున్నామని అంటున్నారు అమ్మకం దారులు. ఈ టైమింగ్స్ బాగున్నాయి. ఇంతకు ముందు సాయంత్రం 7 వరకు ఉండే వారము. తెచ్చిన కూరగాయలు పది లోపే అమ్ముకొని పోతున్నాము… గిరాకీ బాగానే ఉంది. రేట్లు కూడా పెరగలేదు అని అన్నారు. ఈ మార్కెట్ లో రేట్స్ రిజనబుల్…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో రాష్ట్రంలో ప్రస్తుతం కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ అమలులో ఉంటుంది. అయితే, ప్రతిరోజు భారీగా కేసులు నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అనంతపురం జిల్లాలో నిన్నటి రోజున కేసులు 3 వేలకు పైగా నమోదయ్యాయి. మొదటిసారి కేసులు 3…
లాక్‌డౌన్ దేశ రాజధాని ఢిల్లీలో మంచి ఫలితాలు ఇస్తోంది.. క్రమంగా కొత్త కేసులు తగ్గుతూ వస్తున్నాయి.. అయినా, ముందుచూపుతో.. మరో వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ను పొడగిస్తున్నట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్ ఈ నెల 17వ తేదీతో ముగియనుండగా.. మరోసారి ఈ నెల 24వ తేదీ వరకు ఉదయం 5 గంటల వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. అయితే, ఢిల్లీ బాటలో మరో రాష్ట్రం కూడా అడుగులు వేసింది.. కరోనా…
మామూలు రోజుల్లో ఆదివారం వస్తే ఉదయం మధ్యాహ్నం వరకు నాన్ వెజ్ మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. ఎటు చూసినా రద్దీ కనిపిస్తుంది. కానీ, ఇది కరోనా కాలం. నిబంధనలు అమలౌతున్న రోజులు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే సడలింపు ఉన్నది. దీంతో ఉదయం 6 గంటల నుంచి నాన్ వెజ్ మార్కెట్ల వద్ద పెద్ద ఎత్తున ప్రజలు చేరుకున్నారు. భారీ సంఖ్యలో క్యూలు కట్టారు. ముషీరాబాద్ చేపల మార్కెట్ వద్ద ఇసుకేస్తే రాలనంత మంది…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. కేసుల సంఖ్య తో పాటుగా పాజిటివిటి రేటు కూడా పెరుగుతున్నది. దీంతో ఏపీలో ప్రస్తుతం ఉదయం, రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు కర్ఫ్యూ సడలింపులు ఇచ్చి 18 గంటలపాటు కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. కరోనా కేసులు తగ్గక పోవడంతో కొన్ని ప్రాంతాల్లో పూర్తిస్థాయి లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. రాయలసీమలోని అనంతపురం జిల్లాలో ఈరోజు పూర్తిస్థాయి లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఈరోజు…
ప్రకాశం జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రకాశం జిల్లాలోని కనిగిరిలో 24 గంటలపాటు సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు పూర్తి స్థాయి లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. రేపు ఉదయం నుంచి కర్ఫ్యూ సమయంలో ఉన్న సడలింపులు అమలు చేయనున్నారు. పూర్తి స్థాయి లాక్ డౌన్ అమలు చేస్తుండటంతో బస్సులను కనిగిరి డిపోకు పరిమితం…
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ లు కొనసాగుతున్నాయి. తాజాగా మే 30 వరకు పూర్తిస్థాయి లాక్ డౌన్ ను విధిస్తూ శనివారం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ఉదయం 6 గంటల నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. అత్యవసర సేవలను అనుమతించడంతో పాటు, అవసరమైన వస్తువుల కొనుగోలుకు ఉదయం 7 నుంచి 10 గంటల వరకు 3 గంటలు దుకాణాలు తెరిచి ఉంచేలా…
ఏపీ తెలంగాణ బోర్డర్‌లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. లాక్‌డౌన్ కారణంగా ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్ లను తెలంగాణ బోర్డర్‌లోనే అధికారులు అడ్డుకుంటున్నారు. దీంతో అత్యవసర చికిత్స అందక రోగులు మృతిచెందుతున్నారు. ఇలా బోర్డర్‌లో అంబులెన్స్ లను అడ్డుకోవడంపై ఏపీ ప్రభుత్వం మండిపడింది. ఇక, తెలంగాణ బోర్డర్లో అంబులెన్స్ లను అడ్డుకోవడంపై హైకోర్టులో విచారణ జరుగుతున్నది. ఈ విచారణలో ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వం తరపుప అడ్వకేట్ జనరల్ శ్రీరాం వాదనలు వినిపించారు.…