సోమవారం బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 చూసిన వాళ్ళందరికీ ఒక్కటే అనుమానం! ఎప్పుడూ సరదాగా నవ్వుతూ, అందరినీ నవ్విస్తుండే లోబోకు ఏమైంది? అని. ఎందుకంటే… నామినేషన్స్ సమయంలో ఒకరిని ఒకరు విమర్శించుకోవడం, మాటల దాడి చేయడం కామన్. కానీ హద్దు మీరి లోబో సోమవారం ప్రియను టార్గెట్ చేయడం, చిన్న విషయానికి ఆమెపైకి అరుస్తూ, కొట్టడానికే అన్నట్టుగా మీద మీదకు వెళ్ళడంతో చాలామందిని షాక్ కు గురిచేసింది. లోబో ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కాక…