Jharkhand: జార్ఖండ్ లో పాకూర్ జిల్లాలో ఓ ప్రైవేట్ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఏకంగా 110 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని గురువారం అధికారులు తెలిపారు. బుధవారం రాత్రి భోజనం చేసిన తర్వాత కొందరు విద్యార్తులు వాంతులు, తలనొప్పిగా ఉందని ఫిర్యాదు చేశారు. భోజనంలో బల్లి పడటంతోనే ఇలా అయిందని విద్యార్ధులు ఆరోపిస్తున్నారు.