ఏపీలో జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రుల నియామకం జరిగింది. సీఎం జగన్ రాష్ట్రంలోని 26 జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులను ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా ధర్మాన ప్రసాదరావు, శ్రీకాకుళం ఇన్‌ఛార్జ్ మంత్రిగా బొత్స సత్యనారాయణ, అనకాపల్లి ఇన్‌ఛార్జ్ మంత్రిగా పి.రాజన్నదొర, కాకినాడ ఇన్‌ఛార్జ్ మంత్రిగా సిదిరి అప్పలరాజు, పార్వతిపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాల ఇన్‌ఛార్జ్ మంత్రిగా గుడివాడ అమర్నాధ్, పశ్చిమగోదావరి ఇన్‌ఛార్జ్ మంత్రిగా దాడిశెట్టి రాజా,…