Odisha : ఒడిశాలోని కొన్ని జిల్లాల్లో లిథియం నిల్వలు ఉన్నాయని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఈ సమాచారాన్ని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) సీనియర్ అధికారి ఆదివారం ఇచ్చారు.
India found deposit of lithium: ఇన్నాళ్లూ మనం పత్తి పంటను మాత్రమే తెల్ల బంగారమని అనుకునేవాళ్లం. కానీ.. లిథియం అనే ఖనిజాన్ని కూడా తరచుగా తెల్ల బంగారంగానే అభివర్ణిస్తుంటారు. ఎందుకంటే.. ఇండియాలో ఇది ఇప్పటివరకూ చాలా చాలా తక్కువ మొత్తంలోనే దొరికేది. అందుకే.. అత్యంత విలువ కలిగిన బంగారంతో పోల్చారు. అయితే.. ఇప్పుడు ఈ లిథియం ఖనిజం భారతదేశంలో భారీగా ఉన్నట్లు గుర్తించారు.
Today (11-02-23) Business Headlines: బెల్జియం, తెలంగాణ ఒప్పందం: లైఫ్ సైన్సెస్ రంగంలో బెల్జియంకి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరింది. బెల్జియం దేశంలోని ఫ్లాండర్స్ అనే ప్రాంతంలో సుమారు 350 లైఫ్ సైన్సెస్ కంపెనీలు ఉన్నాయి. బయోఏషియా-2023కి ఫ్లాండర్స్ ఇంటర్నేషనల్ రీజనల్ పార్ట్నర్. ఈ నేపథ్యంలో ఫ్లాండర్స్ ఇన్వెస్ట్’మెంట్ అండ్ ట్రేడ్’తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేతులు కలిపింది. తద్వారా లైఫ్ సైన్సెస్ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకోనుంది.