మద్యం షాపుల్లో ఎమ్మార్పీ ఉల్లంఘనలపై ఏపీ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు లిక్కర్ అమ్మే షాపులపై చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది.. ఎమ్మార్పీ ఉల్లంఘనలకు పాల్పడుతూ తొలిసారి దొరికితే ఏకంగా రూ.5 లక్షలు జరిమానా విధించనున్నారు.. అయినా తీరు మారకుండారెండోసారి కూడా అదే జరిగితే సదరు బార్ లేదా లిక్కర్ షాపు లైసెన్స్ రద్దు చేయనుంది ప్రభుత్వం..