ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు నేపథ్యంలో ఆప్‌పై దాడి చేసేందుకు బీజేపీ సరికొత్తగా బాహుబలి చిత్రంలోని కొన్ని క్లిప్‌లను వినియోగించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) అరెస్టు చేసిన కొద్ది రోజుల తర్వాత ఇది జరగడం గమనార్హం.