తాజాగా వైరల్ అవుతోన్న వీడియోలో దాదాపు 10 సినిమాలు ఓ అడవి దున్నను చుట్టుముట్టాయి. ఇంక తన పని అయిపోందనుకున్న దున్న.. గట్టిగా ధైర్యం తెచ్చుకున్నట్టుంది. సింహాలన్నీ చుట్టూ చేరి దాడికి ప్రయత్నిస్తున్నా.. ఆ దున్న మాత్రం దైర్యంగా వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. ఆ దున్న సింహాలనుంచి తప్పించుకునేందుకు పక్కనే ఉన్న నీటి కొలనులోకి దిగి వెళ్తుంది. సింహాలు నీటిలోకి రావు కదా.. అందుకే దైర్యంగా ఆ నీటిలోకి దిగి సింహాలనుంచి తప్పించుకుంది అడవి దున్న.