Today (08-02-23) Business Headlines: కెనరా బ్యాంక్ హెడ్’గా సత్యనారాయణరాజు: ప్రభుత్వ రంగ సంస్థ కెనరా బ్యాంక్ డైరెక్టర్ మరియు సీఈఓగా సత్యనారాయణరాజును నియమించారు. ఈ నిర్ణయం నిన్న మంగళ వారం నుంచే అమల్లోకి వచ్చింది. బ్రాంచ్ బ్యాంకింగ్, కార్పొరేట్ క్రెడిట్, రిటైల్ క్రెడిట్, అగ్రి ఫైనాన్సింగ్, క్రెడిట్ మానిటరింగ్, క్రెడిట్ రికవరీ వంటి విభాగాల్లో సత్యనారాయణరాజును నిపుణుడని చెప్పొచ్చు. అంత మంచి అనుభవం ఆయన సొంతం.