బిహార్ రాష్ట్రంలో పిడుగుపాటుకు 17 మంది ప్రాణాలు కోల్పోయారు. భాగల్పూర్ జిల్లాలో గరిష్టంగా పిడుగుపాటుకు ఆరుగురు మరణించారు. వైశాలి జిల్లాలో ముగ్గురు, బంకా జిల్లాలో ఇద్దరు, ఖగారియా జిల్లాలో ఇద్దరు, ముంగేర్, కతిహార్, మాధేపురా, సహర్సా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున పిడుగుపాటుకు ప్రాణాలు వదిలారు. శనివారం రాత్రి నుంచి ఉరుములు, మెరుపులతో భారీవర్షాలు కురవడంతో 17 మంది మరణాలు సంభవించాయి. బిహార్ రాష్ట్రంలో గత ఏడాది కూడా పిడుగు పాటుకు పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.…