దీపావళి బోనస్ వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పండుగ రానే వచ్చింది. కానీ బోనస్ మాత్రం అకౌంట్లలో పడలేదు. దీంతో ఒక్కసారిగా ఉద్యోగులకు చిర్రెత్తింది. డ్యూటీ పక్కన పెట్టి నిరసనకు దిగారు. అంతేకాకుండా అన్ని టోల్ గేట్లు ఎత్తేసి ఉచితంగా విడిచిపెట్టేశారు. దీంతో ఒక్కసారిగా యాజమాన్యం దిగొచ్చి కాళ్లబేరానికి వచ్చింది.