హైదరాబాద్ లో ఓ హోటల్‌లో విషాదం చోటుచేసుకుంది. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్ నెంబర్ 4 లో ఉన్న GIS హోటల్ లో సూపర్ వైజర్ గా పనిచేస్తున్న శివాజీ గణేష్ లిఫ్ట్ లో ఇరుక్కొని మృతి చెందాడు. అతని వయసు 29 సంవత్సరాలు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ దగ్గర ముద్దం అనే తండాకు చెందిన శివాజీ గణేష్ బతుకు తెరువు కోసం 2019లో హైదరాబాద్ వచ్చాడు. బంజారాహిల్స్‌లో జీఐఎస్ హోటల్లో సూపర్ వైజర్‌గా…
ఉత్తరప్రదేశ్‌లో 1991లో ఈపీసీఈ అనే ఆసుపత్రిని నిర్మించారు. అందులో రోగుల కోసం లిప్ట్‌ను ఏర్పాటు చేశారు. అయితే, 1997 వరకు వినియోగించిన లిఫ్ట్‌ను కొన్ని కారణాల వలన వినియోగించకుండా వదిలేశారు. ఆ తరువాత దాని గురించి ఎవరూ పట్టించుకోలేదు. అయితే, తిరిగి వినియోగంలోకి తెచ్చేందుకు ఇటీవలే అధికారులు ఈ లిఫ్ట్‌ను ఓపెన్ చేయగా అందులో షాకింగ్ దృశ్యాలు కనిపించాయి. లిఫ్ట్‌లో ఓ మనిషికి సంబందించిన అస్తిపంజరం కనిపిచింది. దానిని చూసిన అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.…
వరంగల్ మేయర్ గుండు సుధారాణి లిఫ్ట్ లో ఇరుక్కోవడం కలకలం రేపింది.. హన్మకొండలో చౌరస్తాలో ఓ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి వెళ్ళిన గుండు సుధారాణి లిఫ్ట్ లో ఇరుకున్నారు. హాస్పిటల్ ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా హజరై, తిరిగి వచ్చే క్రమంలో ఆమె లిఫ్ట్ లో ఇరుక్కోవడం కలకలం రేపింది. బిల్డింగ్ యాజమాని నిపుణులను రప్పించి లిఫ్ట్ ని రిపేర్ చేయించారు. సుమారు 10 నిమిషాల పాటు మేయర్ సుధారాణి అందులోనే ఉండిపోయారు. ఇటీవల జరిగిన గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో…