పెద్దల నిర్లక్ష్యం కారణంగా పిల్లలు లిఫ్టుల్లో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోతున్నారు. అయినప్పటికీ అదే ఏమరపాటుగా ఉంటున్నారు. పిల్లలు తెలిసి తెలియక లిఫ్ట్ ఎక్కి ఆ తర్వాత కదులుతున్న సమయంలో డోర్స్ ఓపెన్ చేస్తూ తుంటరి పనులు చేస్తుండడంతో లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోతోంది. తాజాగా ఇలాంటి ఘటనే ఘజియాబాద్ లో చోటుచేసుకుంది. కౌశాంబి ప్రాంతంలోని ఓ అపార్ట్ మెంట్ లో మైనర్ బాలుడు లిఫ్ట్ తలుపు తెరిచి దానిలో చిక్కుకున్నాడు. చాలాసేపటి తర్వాత బాలుడిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.…