Xi Jinping: చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ అదృశ్యం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. గత కొన్ని రోజులుగా జిన్‌పింగ్ మిస్సవ్వడం చూస్తే, ఆ దేశంలో కొత్త నాయకుడు రాబోతున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. చైనాలో అధ్యక్షుడి కన్నా శక్తివంతమైన పార్టీ పోలిట్‌బ్యూరో జిన్‌పింగ్ అధికారాలకు కత్తెర వేసినట్లు తెలుస్తోంది. ఇటీవల, బ్రెజిల్‌లో జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు కూడా జిన్‌పింగ్ హాజరుకాలేదు. గత 10 ఏళ్లలో బ్రిక్స్‌కు హాజరుకాకపోవడం ఇదే తొలిసారి.
Xi Jinping: చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ గత కొన్ని రోజులుగా కనిపించకపోవడంతో ఆ దేశంలో ఏదో జరుగుతోందనే ప్రచారం నడుస్తోంది. 13 ఏళ్లుగా చైనాను పాలిస్తూ, మావో జెడాంగ్ తర్వాత అంతటి శక్తివంతమైన నేతగా మారి జిన్‌పింగ్ పదవి నుంచి దిగిపోతారనే ఊహాగానాలు వెలువడ్డాయి. అంతర్గత రాజకీయ మార్పుల గురించి ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే, బ్రెజిల్‌లోని రియోడి జనీరోలో జరుగుతున్న ‘‘బ్రిక్స్’’ సమావేశానికి జిన్ పింగ్ హాజరుకాకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.
China: భారత్-చైనాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను సరైన దిశలో ముందుకు తీసుకెళ్లేందుకు న్యూఢిల్లీలో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని బీజింగ్ తెలిపింది. మూడోసారి ఎన్నికైన ప్రధాని నరేంద్రమోడీకి చైనా ప్రధాని లీ కియాంగ్ మంగళవారం అభినందనలు తెలియజేశారు.
Li Qiang elected China’s new premier: మూడోసారి చైనా అధ్యక్షుడిగా షి జిన్ పింగ్ మరోసారి అధ్యక్ష బాధ్యతలను తీసుకున్నారు. శుక్రవారం ఆయన మరోసారి అత్యున్నత పదవిని అధిష్టించారు. తాజాగా శనివారం చైనా కొత్త ప్రధానిగా లీ కియాంగ్ ఎన్నికయ్యారు. చైనా నేషనల్ పీపుల్ కాంగ్రెస్ శనివారం లీ కియాంగ్ ను ప్రధానిగా నామినేట్ చేసింది. రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనాకు నామమాత్రం అధికారాలు కలిగిన ప్రధానిగా లీ కియాంగ్ ఉండనున్నారు. 69…