రాష్ట్ర డీజీపీకి తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. నామినేషన్‌లో పొందుపరిచేందుకు తనపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలని లేఖ రాశారు. 2019 తరువాత వివిధ జిల్లాల్లో తనపై పోలీసులు పెట్టిన కేసుల వివరాలు తెలపాలని లేఖలో కోరారు.
గుంటూరు జిల్లాలోని దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహం విధ్వంసంపై డీజీపీకి సోమవారం చంద్రబాబు లేఖ రాశారు. ఇలాంటి చర్యలు పునారావృతం కాకుండా చూడాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. నిన్న దుర్గిలో వైసీపీ జెడ్పీటీసీ సభ్యుడు శెట్టిపల్లి యలమంద కుమారుడు శెట్టిపల్లి కోటేశ్వర్ రావ్ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ధ్వంసం చేశారన్నారు. విగ్రహ విధ్వంసం వివిధ వర్గాల ప్రజల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టే పెద్ద కుట్రలోభాగంగానే చేశారన్నారు. ఇవి ఇలానే కొనసాగితే భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలపై ప్రజలు తిరుగుబాటు…
వంగవీటి రాధా ఇంటికి వెళ్ళిన చంద్రబాబునాయుడు ఆయనతో భేటీ అయ్యారు. తన హత్యకు రెక్కీ నిర్వహించారని కీలక వ్యాఖ్యలు చేశారు వంగవీటి రాధా. ఈ సందర్భంగా రెక్కీ వివరాలను ఆరా తీశారు చంద్రబాబు. రాధా భద్రతకు గన్ మెన్లను కేటాయించింది ప్రభుత్వం. అయితే వాటిని తిరస్కరించారు రాధా. తాజాగా చంద్రబాబు -రాధా ఇంటికి వెళ్ళడంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. విజయవాడలో క్లబ్ దగ్గర ఉన్న వంగవీటి రాధా నివాసానికి వెళ్లారు చంద్రబాబు. వంగవీటి రాధ హత్యకు జరిగిన…