పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌కు లెప్టోస్పిరోసిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ మేరకు మొహాలీ ఫోర్టిస్ హాస్పిటల్ కార్డియాలజీ విభాగం తెలిపింది. బుధవారం అర్ధరాత్రి భగవంత్ మాన్ హఠాత్తుగా స్పృహ తప్పిపడిపోయారు. హుటాహుటినా ఆయన్ను మొహాలీలోని ఫోర్టిస్ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించగా తాజాగా ఆయనకు లెప్టోస్పిరోసిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.
Delhi : దేశ రాజధానిలో దోమల వల్ల వచ్చే వ్యాధుల కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. దోమల వల్ల వచ్చే డెంగ్యూ వ్యాధితో ఆదివారం తొలి మరణం సంభవించింది. డెంగ్యూతో బాధపడుతున్న 54 ఏళ్ల వ్యక్తి గత వారం లోక్ నాయక్ ఆసుపత్రిలో మరణించినట్లు అధికారులు తెలిపారు.