మియాపూర్ మెట్రోస్టేషన్ సమీపంలో చిరుత సంచారం కలకలం రేపింది. చిరుత సంచరిస్తోందని తెలుసుకున్న స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
అదిగో చిరుత, ఇదిగో చిరుత అంటూ చిరుత సంచారం రాజమండ్రి శివారు ప్రాంత ప్రజలను భయాందోళన గురిచేస్తుంది. నాలుగు రోజులుగా కంటిపై కునుకు లేకుండా. భయంతో బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు. ఏ క్షణంలో ఏమి జరుగుతుందోనని భయపడుతున్నారు . చిరుతను పట్టుకోవడానికి అటవీశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం లాలాచెరువు సమీపంలోని గోదావరి మహా పుష్కర వనం - హౌసింగ్ బోర్డ్ కాలనీల సమీపములో అర్ధరాత్రి చిరుతపులి సంచరించిన నేపథ్యంలో అటవీశాఖ సిబ్బంది అప్రమత్తమయ్యారు.
మహానంది క్షేత్రంలో మళ్లీ చిరుత కలకలం రేపింది. క్షేత్రంలోని అన్నదాన సత్రం వద్దకు వచ్చి కుక్కను లాక్కొని వెళ్లింది. చిరుతను చూసి ఆలయ సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు.
గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పుణ్యక్షేత్రాలతో పాటు అనేక గ్రామాల్లో వన్య మృగాల సంచారం అధికం అయిపోయింది. తిరుపతి, శ్రీశైలం సహా అనేక పుణ్యక్షేత్రాల్లో క్రూరమృగాల సంచారం ఎక్కువైపోయింది. దైవ దర్శనానికి వెళ్లే భక్తులపై దాడులకు పాల్పడుతుండడంతో భక్తులు భయాందోళన మధ్య క్షేత్రాలకు వెళ్తున్నారు.