వికారాబాద్ జిల్లా తాండూర్లో చిరుత పులి కూనలు ప్రత్యక్షమయ్యాయి.. గత నెల 28న కోటబాస్ పల్లి పరిసరాల్లో చిరుత పులి కూనలను గ్రామస్తులు గుర్తించారు. అయితే.. ఓ కూన పిల్లను గుర్తించి అటవీ శాఖ వైద్యులు వైద్య పరీక్షలు జరిపారు. అనంతరం.. పులి కూన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తాజాగా మరో పులి కూనను డ్రైవర్ జావిద్ గుర్తించారు.