ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలలో పాల్గొనటం చంద్రబాబుకు ఇష్టం లేదని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి తీవ్రంగా విమర్శించారు. రౌడీయిజం చేసి, రిగ్గింగులు చేసి గెలుపొందాలనుకోవటం దారుణమని ఆరోపించారు.
ఒకప్పుటి రాజకీయ ప్రత్యర్థులు ప్రస్తుతం ఒకే పార్టీలో ఉన్నా.. ఆ వైరం పోదు. కలిసి సాగలేరు. వెళ్దామన్నా ఇగోలు.. పాత గొడవలు అడ్డొస్తాయి. గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు అధికార పార్టీ నేతల మధ్య అదే జరుగుతోందట. పరస్పరం పైచెయ్యి సాధించేందుకు వారు వేయని ఎత్తుగడలు లేవంటున్నారు పార్టీ నాయకులు. ఇంతకీ ఎవరా నేతలు? ఏమా కథా? గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రాజకీయాలు ఎప్పుడూ హాట్‌గానే ఉంటాయి. జిల్లాలోని కీలక నేతలంతా నివాసం ఉండేది ఇక్కడే. అందుకే…