తెలుగునాట మహానటులుగా వెలుగొందిన యన్టీఆర్, ఏయన్నార్ ఇద్దరితోనూ దిలీప్ కుమార్ కు సత్సంబంధాలు ఉండేవి. తెలుగులో ఏయన్నార్ ‘దేవదాసు’గా నటించి అలరించగా, ఉత్తరాదిన హిందీ ‘దేవదాస్’లో దిలీప్ నటించి మెప్పించారు. అక్కినేని ‘దేవదాసు’ చూసిన దిలీప్, “ఏయన్నార్ ఇంత బాగా చేశారని తెలిస్తే, నేను నటించడానికి అంగీకరించేవాణ్ణే కాదు” అని కితాబు నిచ్చారు. అదే తీరున దిలీప్ ‘దేవదాస్’ చూసిన అక్కినేని, “మా ‘దేవదాసు’లో హీరోని ప్రేమికునిగా చిత్రీకరించారు. అసలైన ఆత్మ దిలీప్ ‘దేవదాస్’లోనే ఉంది” అంటూ…
ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ బుధవారం ఉదయం 7.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. 1944 నుంచి 1998 వరకు దిలీప్ కుమార్ చిత్రపరిశ్రమలో రాణించగా.. ఉత్తమ నటుడిగా ఆయనకు 8 సార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, 1993లో ఫిలింఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు దక్కించుకున్నాడు. 1994లో దిలీప్‌కుమార్‌ను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. ఈ దిగ్గజ నటుడి సేవలను గుర్తించిన ప్రభుత్వం 1991లో పద్మభూషణ్, 2015లో…
బాలీవుడ్ సీనియర్ హీరో దిలీప్ కుమార్ ఇటీవల ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. నెల రోజుల వ్యవధిలోనే ఆయన ఆసుపత్రిలో చేరడం ఇది రెండవసారి. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయనకు గత కొన్ని రోజులుగా ఖార్‌లోని హిందూజా ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు)లో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దీనికి ముందు దిలీప్ కుమార్ జూన్ 6న థెస్పియన్ ఆసుపత్రిలో చేరాడు. అక్కడ అతనికి బిలటేరల్ ప్లూరల్ ఎఫ్యూషన్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. చికిత్స అనంతరం…